రైతులకు తీపికబురు..ఎరువులపై రాయితీ పెంచిన కేంద్రం

-

రైతులకు ఇది శుభవార్తే.. డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.700 రాయితీని పెంచింది. వ్యవసాయంలో అధిక శాతం వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ డీఏపీపై పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. గత నెల ప్రధాని మోడీ డీఏపీపై 140 శాతం రాయితీని పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో యూరియాపై రూ. 500 నుంచి రూ.1200 పెంచింది.

దీనివల్ల ఇప్పటి వరకు రూ.2400 కు లభించిన డీపీఏ ఇక నుంచి రూ.1200 కే రైతులకు అందుబాటులో ఉండనుంది.డీఏపీ వల్ల రైతులకు ఎక్కువ మారిందని గ్రహించిన కేంద్రం రాబోవు ఖరీఫ్‌ సీజన్‌ వరకు గరిష్టంగా డీఏపీ రీటైల్‌ ధరలను గత సంవత్సరం ధరల మాదిరి అందుబాటులో పెట్టనుంది. కొన్ని కంపెనీలు డీఏపీ ధరలను పెంచినా.. కేంద్రం ఆ ధరలను తగ్గించి రైతులకు అందుబాటులోకి తేనుంది. కొవిడ్‌ ప్యాకేజీలో భాగంగానే రైతులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి, అప్పుడు ధరలను మరోసారి నిర్ణయిస్తామని తెలిపింది.


డీప్‌ ఓషన్‌ మిషన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. సముద్ర వనరులను సరైన రీతిలో వినియోగించుకునే సైంటిఫిక్‌ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్ని సంస్థాగత ప్రతిపాదన కోసం మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌కు పంపింది. దీంతో కేంద్రం రానున్న ఐదేళ్ల కాలంలో రూ.4,077 కోట్లను ఖర్చు చేయనుంది. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జయదేవకర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ టెక్నాలజీ కేవలం యూఎస్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా వంటి 5 దేశాల్లోనే అందుబాటులో ఉందన్నారు. మెరైన్‌ రంగంపై గ్రౌండ్‌ లెవల్‌ విశ్లేషణ జరిపిన అనంతరం «థర్మల్‌ శక్తి విస్త్రతికి తోడ్పడుతుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version