జంతువుల నుండి మనుషులకు కరోనా సోకుతుందా..?

-

చెన్నై జూ లో 9 ఏళ్ల సింహం కరోనా తో చనిపోయింది. ఒక జంతువు కరోనా వైరస్ తో మృతి చెందడం భారత దేశంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు ఏనుగులు కి కూడా కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు విడిచారు.

స్టడీస్ ప్రకారం వైరస్ ప్రజలకి రెస్పిరేటరీ డ్రాప్ లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుందని ఎవరైనా దగ్గరగా ఉంటే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తేలింది. అదే విధంగా మనకు దగ్గరగా ఉండే జంతువులు కి కూడా కరోనా వైరస్ సోకుతుంది.

జంతువుల నుండి మనుషులకు వైరస్ సోకుతుందా..?

మామూలుగా గబ్బిలాల నుండి మనుషులకు ఈ వైరస్ వచ్చింది అని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఎటువంటి ప్రూఫ్ లేదు. అయితే జంతువుల నుండి మనుషులకు ఈ వైరస్ సోకడం అనేది చాలా అరుదు. కానీ మనుషుల నుండి వివిధ రకాల జంతువులకి వైరస్ సోకుతుంది. నెదర్లాండ్స్ లో మిక్స్ కి మనుషుల నుండి సోకింది.

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఏం చేయాలి..?

ఒకవేళ కనుక మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే అప్పుడు మీరు ఇతర కుటుంబ సభ్యులు ట్రీట్ చేసినట్టే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కరోనా వైరస్ రిస్కు వాటికి కూడా ఉంది అని మీరు గమనించాలి.

వాటిని బయటికి ఫ్రీగా వదిలేయకుండా లోపల జాగ్రత్తగా ఉంచండి మీ ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకి ఆరడుగులు దూరం పాటించండి. మాస్క్ మాత్రం పెట్టొద్దు ఎందుకంటే వాటి వల్ల అవి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలానే వెటర్నరీ డాక్టర్ తో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version