ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు ఉన్న లాక్డౌన్ సడలింపులని సాయంత్రం 5గంటల వరకు పెంచుతూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇళ్ళకి చేరుకోవడానికి మరో గంట సమయాన్ని ఇచ్చింది. సాయంత్రం 6గంటల నుండి పొద్దున 6గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ఇక ఈ సడలింపులు కొన్ని నియోజకవర్గాలకి వర్తించదు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర..నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో సడలింపులు మధ్యాహ్నం వరకు ఉన్నాయి.
సడలింపుల సమయం పెరగడంతో ఆర్టీసీ బస్సులు కదులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3600బస్సులు రోడ్ల మీదకి రానున్నాయి. అలాగే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. సాయంత్రం 5గంటలకు చివరి మెట్రో రైలు ఉండనుంది. ఇదిలా ఉంటే కరోనా మాస్ వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్ప్రెడర్లుగా భావించే అందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.