LIC: రూ.71 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే .. రూ.48 లక్షల ఆదాయం..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. చాలా మంది డబ్బులని పెడుతున్నారు. దేశం లోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ అయినా LIC లో కోట్లాది మంది పాలసీదారులు ఉన్నారు. LIC లో డబ్బులు పెడితే చక్కటి రాబడి వస్తుంది. అయితే అందించే వాటిల్లో ఎండోమెంట్ ప్లాన్ ఒకటి. ప్రతి రోజూ రూ.71 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పై రూ.48.75 లక్షలు పొందొచ్చు.

ఇందులో డబ్బులు పెడితే డెత్ బెనిఫిట్‌ని కూడా పొందచ్చు. నాన్-లింక్డ్, పార్టిసిటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా ప్లాన్ ఇది. పొదుపు , బీమా రక్షణ రెండూ ఈ ప్లాన్ తో పొందొచ్చు. ఒకవేళ కనుక పెట్టుబడిదారుడు మరణిస్తే హామీ మొత్తం ప్రయోజనం ని పొందొచ్చు. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీపై పూర్తి డబ్బును పొందొచ్చు. లోన్ సదుపాయాన్ని కూడా పొందొచ్చు.

ఇందులో కనీస హామీ లక్ష. ఎంతైనా పెట్టచ్చు. లిమిట్ ఏమి లేదు. 8 సంవత్సరాలు పక్కా పెట్టుబడి పెట్టాలి. ఈ పధకంలో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. మెచ్యూరిటీ గరిష్ట వయస్సు వచ్చేసి 75 సంవత్సరాలు. పాలసీ వ్యవధి 12 నుండి 35 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయస్సులో ఎండోమెంట్ ప్లాన్‌ని తీసుకుని 35 సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకుంటే ప్రతి సంవత్సరం రూ. 26,534 వార్షిక ప్రీమియం రూ. 10 లక్షల మొత్తానికి పే చెయ్యాల్సి వుంది.

తరవాత సంవత్సరం నుండి ఈ ప్రీమియం రూ.25,962కి తగ్గుతుంది. అంటే రోజు కి రూ.71 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మెచ్యూరిటీపై రూ. 48.75 లక్షలు వస్తాయి. పెట్టుబడి మొత్తం రూ. 9.09 లక్షలు కాగా రూ.48 లక్షల కంటే ఎక్కువ రాబడిని పొందొచ్చు .

Read more RELATED
Recommended to you

Exit mobile version