చాలా మంది ఈ మధ్య కాలం లో ఇన్వెస్ట్ చెయ్యాలని చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా మంచి స్కీమ్ లో చేరాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక ఈ స్కీమ్ గురించి చూడండి. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి.
దీనిలో డబ్బులని పెట్టడం వలన అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి ఒకటిన ప్రారంభించింది. పదవీవిరమణ పథకం ఇది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు పన్ను మినహాయింపులు పొందవచ్చు. పదవీవిరమణ సమయానికి పెద్ద మొత్తంలో మీరు స్థిర ఆదాయాన్ని పొందొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ అర్హత వివరాలు:
18 ఏళ్లు నిండిన భారతపౌరులు ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అర్హులే. పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇచ్చేనందుకే ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. కనీసం రూ. 500 టైర్ లేదా టైర్ 2 ఖాతాను ఓపెన్ చెయ్యచ్చు. మీరు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ తో ఎంత వస్తుంది..?
30 ఏళ్లు అయితే 60 ఏళ్ల వయస్సులో రిటైర్ అవుతారు. ఇప్పటి నుంచే ప్రతి నెలా రూ. 5,000 చొప్పున ఎన్‌పీఎస్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే పదవీ విరమణ చేసే సమయానికి రూ. ఒక కోటి కంటే ఎక్కువే వస్తుంది. పెట్టిన పెట్టుబడిపై కనీసం రాబడి 10 శాతం అంచనా వేసినా రూ. 1.11 కోట్లు ఉంటుంది. 60 సంవత్సరాల వచ్చేసరికి నెలకు రూ. 27,996 పెన్షన్ వస్తుంది.