కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలానే కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలని భావించే వారి కోసం ఒక స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ని వ్యాపారుల కోసం తీసుకొచ్చారు. మరి ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముద్రా లోన్స్ ని ఇస్తున్నాయి.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ఎప్పుడు వచ్చింది..?
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ని వ్యాపారుల కోసం తీసుకొచ్చారు. వ్యాపారులకు ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న వ్యాపారులు, ఎంట్రపెన్యూర్ల కోసం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ని ఆవిష్కరించడం జరిగింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు ఈ స్కీమ్ కింద లోన్ తీసుకోచ్చు. లేదంటే ఇప్పటికే బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ స్కీమ్ కింద లోన్ తీసుకోవచ్చు.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ లో రకాలు:
శిశు, కిశోర్, తరుణ్ అనేవి ఈ స్కీమ్ లో రకాలు.
రూ.50,000 లోపు రుణాలు శిశు విభాగం కిందకు వస్తాయి.
రూ.50 వేల నుంచి రూ.5 లక్షలలోపు అయితే కిషోర్ విభాగం కిందకు వస్తాయి.
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలలోపు రుణాలు తరుణ్ విభాగం కిందకు వస్తాయి.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి..?
ఆధార్ కార్డు
బ్యాంక్ అకౌంట్
బ్యాంక్ స్టేట్‌మెంట్
ఐటీఆర్
జీఎస్‌టీ ఐడెంటిఫికేషన్ నెంబర్
పాన్ కార్డు
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలి..?
https://www.udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లేదా దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా లోన్ దేని కోసం పొందొచ్చు..?
మ్యానుఫ్యాక్చరింగ్
ట్రేడింగ్
సర్వీసెస్ రంగంలోని వ్యాపారాలు
వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు
బ్యూటీపార్లర్
జిమ్
ఇలాంటి వాటి కోసం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా లోన్ ని పొందవచ్చు.