గర్భవతులు చాక్లెట్స్ తింటే తినొచ్చా.. రోజూ తింటే ఏమౌతుంది?

-

గర్భవతులు చాలా సున్నితమైన వాళ్ళు.. ఏది తక్కువ తీసుకున్నా సమస్యే, ఎక్కువ తీసుకున్నా సమస్యే.. అందుకు ఎప్పుడూ వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల కోరికలు విచిత్రంగా ఉంటాయి. పానీ పూరీ, చాట్, చాక్లెట్లు, మామిడి కాయ ఇలా ఎన్నో ఆహారాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. పుఢ్ క్రేవింగ్కు సమయం సందర్భం అని ఉండదు. కొన్ని సార్లు అర్ధరాత్రి సమయంలోనూ ఏదొకటి తినాలని పిస్తుంది. గర్భదారణ సమయంలో ఇద్దరికోసం తినాలి కాబట్టి.. పెద్ద వారు కూడా వాళ్లు అడిగింది వెంటనే చేసిపెట్టేస్తారు.

 

ప్రగ్నెన్సీ సమయంలో గర్భిణీలకు ఎక్కువగా తినాలనిపించే వాటిలో చాక్లెట్ ఒకటి.. కొంతమంది కొంచెం ఎక్కువగానే చాక్లెట్లు తింటూ ఉంటారు. గర్భదారణ సమయంలో మహిళలు చాక్లెట్ తింటే మంచిదేనా.. బిడ్డపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం..

ప్రీక్లాంప్సియా అనేది అధిక రక్తపోటు, మూత్రంలో అధిక ప్రొటీన్ విసర్జన లక్షణం. గర్భధారణ సమయంలో గర్భాశయ పిండం పరిమితి పెరగడం వల్ల, ప్రసూతి వల్ల కలిగే నష్టాల వల్ల ప్రీక్లాంప్సియా ఏర్పడుతుంది. ప్రీక్లాంప్సియా కారణంగా నెలలు నిండానే ప్రసవం, మూర్ఛలు, బిడ్డ చనిపోవడం లాంటివి జరిగే ప్రమాదం ఉంది..అయితే డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.

తొమ్మిదో నెల సమయంలో మహిళలకు ఎన్నో రకాల మార్పులు రావడం సహజం..చాక్లెట్ తింటే గర్భిణీల స్ట్రెస్‌ లెవల్‌ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

గర్భదారణ సమయంలో రోజూ చాక్లెట్ తినే స్త్రీలకు మొదటి మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే అవకాశం 20 శాతం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

ప్రెగ్నెన్సీ సమయంలో బరువును అదుపులో ఉంచడానికి చాక్లెట్‌ సహాయపడుతుందని. రోజు కొంచెం డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే..చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి..అందుకే డైలీ ఒక బైట్ డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version