విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హాసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించింది .ఈ విషయాన్ని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు .దౌత్య పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరిస్తూ సమాధానం ఇవ్వడానికి పది రోజుల గడువు ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఇండియా నుంచి పారిపోయారు.
ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు రానున్నాడు.మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాల్సి వస్తే విమానాశ్రయం నుండే అరెస్టు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.