ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రూల్స్, నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లొద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తాడేపల్లి సీఐకు దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఏజెంట్లను అడ్డుకోమని వైసీపీ ఏజెంట్లకు సజ్జల చెప్పడంపై ఫిర్యాదు ఇచ్చారు. సజ్జలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు సజ్జల కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ డైరెక్షన్‌లో కౌంటింగ్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమ వెల్లడించారు.