గంజాయి.. బండి సంజ‌య్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌దు : ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి, బండి సంజ‌య్ కి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్య జీవ‌న్ రెడ్డి అన్నారు. కాగ ఇటీవ‌ల బీజేపీ ఎంపీ పై ఆర్మూర్ లో దాడి జ‌రిగిన విషయం తెలిసిందే. కాగ ఈ దాడిని నిర‌సిస్తు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంపీ బండి సంజ‌య్ ఆర్మూర్ లో ప‌ర్య‌టించారు. అయితే ఆర్మూర్ లో సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజ‌య్ వాడ‌ని భాషా అభ్యంత‌రక‌రంగా ఉంద‌ని అన్నారు. రైతుల‌ను ఉగ్ర‌వాదులతో పోల్చ‌డం స‌మంజ‌స‌మేనా అని అన్నారు.

కాగ రైతులను ఉగ్ర‌వాదుల‌తో పోలిస్తే.. బండి సంజ‌య్ తెలంగాణ‌లో తిర‌గ‌లేర‌ని అన్నారు. రాజ‌కీయ భ‌విష్యత్తు కోల్పోతార‌ని అన్నారు. బీజేపీ నాయ‌కులు భాషా మార్చుకోక‌పోతే.. టీఆర్ఎస్ సైన్యం చూస్తు ఊర‌కోద‌ని హెచ్చ‌రించారు. కాగ ఎంపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బాండ్ పేప‌ర్ రాసింది అర‌వింద్ కాదా అని అన్నారు. బాండ్ పేప‌ర్ రాసి ఇచ్చి.. ప‌సుపు బోర్డు హామీ నేర‌వేర్చ‌క పోవ‌డంతో రైతులు ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై ఆగ్ర‌హం గా ఉన్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version