మెదక్ లో పోటీ చేసే మొనగాడు బీఆర్ఎస్ కి దొరకలేదా ..? : రేవంత్ రెడ్డి

-

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నర్సాపూర్ లో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. 1980లోనే ఇందిరాగాంధీ భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఇక్కడ పోటీ చేసే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ భూములు గుంజుకున్నాడు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు అవకాశం ఇవ్వండి అని కోరారు.

కరీంనగర్ నుంచి తీసుకొచ్చి వెంకట్రామ్ రెడ్డి ని ఇక్కడ ఎంపీగా నిలబెట్టారు. మెదక్ లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే మగాడు కేసీఆర్ కు దొరకలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మనకు సంప్రదాయాలు నేర్పాలా..?  సోనియాగాంధీ భయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. మోడీ మనకు గాడిద గుడ్డు ఇచ్చాడని గుర్తు చేశారు. శ్రీరామ నవమి మన తాతలు, తండ్రులు చేయలేదా..? అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాడిద గుడ్డ ఇచ్చిన మోడీని కర్రు కాల్చి వాత పెట్టినట్టు.. నీలం మధుకు ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version