ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఒక యువతితో శృంగారం చేస్తూ దొరికిపోయారు. అయితే… ఇద్దరు వ్యక్తులు ఒక యువతితో శృంగారం చేస్తున్న తరుణంలో.. కారు డివైడర్‌ను ఢీకొనడంతో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద బాధితులను కాపేందుకు ఆ కారు వద్దకు స్థానికులు వచ్చారు.
దీంతో వాహనంలో నలుగురు పిల్లలతో ఇద్దరు అబ్బాయిలు నగ్నంగా కనిపించారు. ఒక మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వేగంగా వెళ్తున్న కారులో ముగ్గురు సెక్స్‌లో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. నగ్నంగా కనిపించిన అబ్బాయిలు మద్యం మత్తులో ఉన్నారని కూడా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన శనివారం (జూలై 27) రాత్రి జజ్మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెకె చౌరాహా సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ, చిన్నారులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.