కార్ల విషయంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం…!

-

హైదరాబాద్ లో ట్రాఫిక్ ని కట్టడి చెయ్యాలంటే ఎం చెయ్యాలి…? అసలు ఎం చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది…? ఈ ప్రశ్నకు ఏ విధంగా చూసినా అటు హైదరాబాద్ పోలీసులు గాని ఇటు ప్రభుత్వం గానీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లు ఎంత విస్తరిస్తున్నా సరే సరిపోయే పరిస్థితి లేదు. కార్లు, బైక్ లు ఇలా హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అటు సిటి బస్సులు కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి.

మెట్రో రైలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నా సరే ఇప్పుడు అది కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ లో ఇక నుంచి తిరిగే కార్లలో ఒక్కరే ప్రయాణించకుండా పూలింగ్‌ పద్ధతిలో నలుగురైదుగురికి తక్కువ కాకుండా చూడాలని నిర్ణయం తీసుకునే యోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. దీనితో రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ లో వంద కార్లు తిరుగుతుంటే అందులో 80 కార్లలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. దీనితో వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా రోడ్లను ఆక్రమించేస్తున్నాయి. దీనితో ఈ నిర్ణయం తీసుకుంటే ట్రాఫిక్ కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రవాణా శాఖ అధికారులు త్వరలో ఒక సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం క్యాబ్ సర్వీసులు అందిస్తున్న… ఉబర్‌, ఓలా లాంటి అనేక ప్రైవేటు సంస్థలు కార్‌పూలింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా దీనిపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఐటి కంపెనీలలో ఎక్కువగా ఉద్యోగులు ఈ విధానం ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. దీనితో హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version