ఏపీలో విద్యుత్ చార్జీలు పెంపు

-

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు ప్రభుత్వం పెంచింది. 500 యూనిట్లకు పైబడిన వారికి చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిట్ ధర 9.5 నుంచి 9.95 కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచుతారు అనే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలోనే విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీనితో ఈ ప్రభావం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై పడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. విద్యుత్ కోతలతో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడిన చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడే ఆ నష్టాల నుంచి బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నిర్ణయం వారిపై పెను భారం మోపనుంది.

అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు కట్టడంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా కట్టాల్సి ఉంది. దీనికి తోడు ఆదాయ వనరులు తగ్గిన నేపధ్యంలో పలు ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతూ వస్తుంది. ఈ తరుణంలో విద్యుత్ చార్జీలను పెంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version