కరోనా మహమ్మారిని నిలువరించేందుకు పలు సంస్థలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశాయి. అయితే కొన్ని టీకాల వల్ల శరీరంపై దుష్పభావం పడుతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా కొవిడ్-19పై పోరుకు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ టీకాను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని మల్హోత్రా తెలిపారు. ఈ తరహా దుష్ప్రభావాలు ఉన్నాయంటూ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్ టీకాలను నిషేధించాలని ఆయన చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కొవిషీల్డ్‌తో గుండెపై ఇంతకుమించిన స్థాయిలో నష్టాలు ఉంటాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందినవారిలో పది శాతం మందికి ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించారు.