వామ్మో చైనా ఆ విషయం బయట పెట్టడం లేదు ..  త్వరగా చెప్పకపోతే ప్రపంచం మొత్తం ఓవర్ ?

-

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ 50 దేశాలలో ఈ వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో తీవ్ర ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. చైనా లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ చైనా దేశస్థుల ను గడగడలాడించింది. దాదాపు చైనాలో మూడు వేల దాకా ఈ వైరస్ వల్ల మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ బారిన పడినవారి  బాధితుల సంఖ్య 78,824కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 83,000 నమోదైనట్లు సమాచారం.

అతి భయంకరంగా అతివేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ అరికట్టడానికి ఆయా దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వ్యాధి అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా మహిళకు సోకటం తో ఆమె ఆచూకీ కోసం ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇక ఇప్పటికే ఈ వ్యాధి ఇరాన్‌లో కూడా వ్యాపించినట్లు సమాచారం. మరోపక్క ఈ వ్యాధి ఈ యొక్క వ్యాక్సిన్ ఇజ్రాయెల్ దేశం కనిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాగా ఈ వ్యాధి బారిన పడిన చైనా దేశంలో నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. జబ్బుపడి బాగుపడిన రోగుల గురించి ఇటీవల చైనా కొన్ని వార్తలు ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. అయితే జబ్బు తగ్గిన వారికి మళ్లీ కరోనా వైరస్ వస్తుందా రాదా అనే దాని విషయంలో మాత్రం చైనా క్లారిటీ ఇవ్వకపోవటం పట్ల ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. కాగా వ్యాధి సోకి మళ్లీ బాబు పడిన వాళ్ళు సామాన్య జనులలో కలిశాక మళ్లీ వ్యాధి వస్తే కనుక ప్రపంచం పని అయిపోయినట్లే అని చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version