కుప్పంలో పలువురు టిడిపి నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ 18మంది టిడిపి నేతలపై కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అంటూ మాజీ మంత్రి అమరనాథరెడ్డి పోలీసులు పై ఫైర్ అయ్యారు. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశామన్నది అవాస్తవమని ఆయన అన్నారు. కమిషనర్ వైసిపి తొత్తుగా మారారు అంటూ అమరనాథ్ రెడ్డి ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో కమిషనర్ పనిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు పులివర్తినాని కూడా ఈ ఘటన పై ఫైర్ అయ్యారు.
కుప్పంలో ప్రజాస్వామ్యబద్థంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. వైసిపి నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని….ప్రతిపక్షనేతపై వైసిపి బూతుపురాణం బాధాకరమని అన్నారు. టిడిపి నేతలకు సంస్కారంగా మాట్లాడడం మాత్రమే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.