దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కేసులు వదిలిపెట్టడం లేదు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదయింది. చింతమనేని ప్రభాకర్ తనను ఫోన్ లో బెదిరించారని జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి చింతమనేని ప్రభాకర్‌పై ఇప్పటికే 66 కేసులు నమోదు అయ్యాయి.
ఇక తాజాగా నమోదు అయిన కేసుతో మొత్తం 67 కేసుల కారణంగా ఏలూరు జిల్లా జైలులో ఉన్నారు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చిన ప్రతిసారీ మరో కేసు నమోదు అవుతుంది. తాజాగా నమోదయిన కేసుతో చింతమనేని ప్రభాకర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లయింది.