సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 73 మంది ఉన్నారు. అయితే 26 మంది సురక్షితంగా బయటపడితే.. ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు. ఇక అప్పటి నుంచి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గోదావరి బోటు ఆపరేషన్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన 38 రోజులకు ధర్మాడి సత్యం బృందం, డైవర్లు బోటును వెలికితీయడంలో సక్సెస్ అయ్యారు. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో సగానికిపైగా వెలికితీశారు. ఇప్పటికే రాయల్ విశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. కాగా, ధర్మాడి బృందం బోటును మరో రెండు గంటల్లో పూర్తిగా బయటకు తీసుకురానున్నారు.