హెరిటేజ్ ఫ్రెష్ పై 7 కేసులు నమోదు..

-

బంజారాహిల్స్ రత్నదీప్ పై ఐదు కేసులు

జూబ్లీహిల్స్ హెరిటేజ్ పై తూనికలు, కొలతల శాఖ ఏడు కేసులు నమోదు చేసింది. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థలపై అధికారులు కొరఢా ఘుళిపించారు. కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ వాటిని పాత ధరకే విక్రయించడంతో పాటు నిబంధనలు పాటించని వ్యాపార సముదాయాలపై దాడులు కొనసాగించారు. దాదాపు 16 గ్రూప్ లుగా విడిపోయి హైదరాబాద్ పరిధిలోని సూపర్ మార్కెట్స్ ఇతర షాపింగ్ మాల్స్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు.

దీంతో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో జూబ్లీహిల్స్ హెరిటేజ్ ఫ్రెష్ పై 7 కేసులు, బంజారాహిల్స్ రత్నదీప్ సూపర్ మార్కెట్ పై 5 కేసులు, మణికొండ, మాదాపూర్, ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news