బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కొనసాగుతున్న కేసుల పరంపర. ఇప్పటివరకు తెలంగాణలో 6 చోట్ల రాజాసింగ్‌పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 4 చోట్ల కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాదులోని మంగళ్‌హాట్, బహదూర్‌పురా, డబీర్‌పురా, బాలానగర్‌లో కేసులు నమోదు కాగా.. మిగతా రెండు సంగారెడ్డి, నిజామాబాద్‌లో రాజాసింగ్‌పై కేసులు అయ్యాయి. మంగళ్‌హాట్‌లో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 153-ఏ, 295-ఏ, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు చేశారు.
ఓ ప్రైవేట్ యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసారు. 10 నిమిషాల 27 సెకన్ల వీడియోలో ఒక వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మత ఘర్షణలు సృష్టించే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో బీజేపీ మంగళ్‌హాట్ పీఎస్‌లో నమోదైన కేసులో రాజాసింగ్ ని అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు.