తెలంగాణ రాష్ట్ర మహిళలకు బిగ్ అలర్ట్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ఈనెల 26వ తేదీ నుంచి అమలు కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒక కిటుకు పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2023 నుంచి 2024 లో ఉపాధి హామీ స్కీం లో కనీసం 20 రోజులు పని దినాలు పూర్తిచేసిన వారికి కుటుంబం యూనిట్ గా దీన్ని అమలు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు.
కుటుంబంలోని మహిళా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారట. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే వారిద్దరి లో పెద్ద వయసు ఉన్న వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబంలో పెద్ద అకౌంట్… లో నగదు వేస్తారని అధికారం చెబుతున్నారు.