రఘురామకృష్ణంరాజుకు జిల్లాలో ఎదురవుతున్న పరిస్థితి ఇది!

-

ప్రతీదానికీ ఒక లిమిటి ఉంటుంది.. ప్రతీ పనికి ఒక విధానం ఉంటుంది.. అధినేతను కలవాలంటే ఒక మార్గం ఉంటుంది… అవన్నీ మరిచిపోయి ప్రవర్తించారు అనే విమర్శను సంపాదించుకున్నారు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణం రాజు! అధినేతపై గౌరవం చూపిస్తున్నట్లు నటిస్తూనే తన అహంకారాన్ని వెళ్లబుచ్చుతున్నారని… జగన్ పై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే తన పొగరు చూపిస్తున్నారని… తన పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల గెలుపులో తన వాటానే ఎక్కువని అన్నట్లుగా మాట్లాడుతున్నారని జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలకు జిల్లాలో ఆగ్రహ జ్వాలలు లేస్తున్నాయి.

నిజంగా రఘురామ కృష్ణంరాజుకి జగన్ పై అంత ప్రేమే ఉంటే… ఇది మార్గం కాదని.. ఇది ఎంపీకి తెలియని విషయం కాదని.. ఆయన మాటలకు, చేస్తున్న చేష్టలకు అర్ధం వేరని.. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏమిటో ఆయనే చెప్పాలని వైకాపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలు అయిన కార్మూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజులపై రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలకు వైకాపా కార్యకర్తలు ఫైరవుతున్నారు. తక్షణం వాళ్లందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే నియోజకవర్గ వ్యాప్తంగా రఘురామకృష్ణం రాజుపై కొన్ని బలమైన విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. నోరు అదుపు మాట పొదుపు అన్న విషయాలు ఆయన మరిచిపోతుంటారని… దానికిగల కారణాలు అనేకమని… అందులో ధనబలం ఒకటని కొందరు అభిప్రాయపడుతుంటారు. వ్యాపారలు చేసి ధనం ఆర్జిచడం, తద్వారా ఆ బలాన్ని, తద్వారా వచ్చిన మిగిలిన వాటిని చూపించడం వేరు కానీ… ఒక్కసారి ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే ప్రవర్త్న ఇలా ఉండకూడదని మరికొందరు సూచిస్తున్నారు. ఈ విషయాలు తెలిసే చేస్తున్నారో.. తెలియకుండానే ఇంతవరకూ వచ్చేశారో తెలియదు కానీ… ఇంటా బయటా రఘురామకృష్ణం రాజు విమర్శలనెదుర్కోంటున్నారు.

ఇందులో భాగంగా ఆయన సొంత సామాజిక వర్గం నుంచే ఇప్పుడు తీవ్ర ఆగ్రహ జ్వాలలు లేస్తున్నాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి క్షతిరియ సంఘాలు. ఇదే క్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అవినీతి ఆరోపణలు తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా యాదవ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కొట్టు సత్యనారాయణ విషయంలోనూ ఆయన సామాజిక వర్గం ఫైరవుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సామాజికవర్గ నేతలు,, వైకాపా కార్యకర్తలు… వైకాపా ఎమెల్యేలకు, మంత్రికి క్షమాపణలూ చెప్పని పక్షంలో… నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు! దిష్టిబొమ్మలను దహనం చేస్తూ… ఫ్లెక్సీపైపసుపు నీళ్లు చల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version