పిట్టకథతో యనమలపై క్లారిటీ ఇచ్చిన బోస్!

-

తనకు అన్ని రూల్సూ తెలుసు అన్న చందంగా చెప్పుకుంటారు కానీ ఆ రూల్స్ కు తగ్గట్లుగా మాత్రం నడుచుకోరు… మనిషి పెద్దోడే కానీ బుద్దిపెరగలేదు అంటూ ఏపీ శాసనసభలో మంత్రులు.. మండలిలోని యనమల రామకృష్ణుడిపై పరోక్ష విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చేలాగానే యనమల ప్రవర్తన రోజు రోజుకీ అత్యంత దారుణంగా తయారవుతుందనే విమర్శలూ తనుగుణంగా వస్తూనే ఉన్నాయి! ఈ క్రమంలో మరోసారి శాసనమండలిలో యనమల ప్రవర్తించిన తీరుపై మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్ మండిపడ్డారు! పిట్టకథ చెప్పి యనమల పద్దతిని చెప్పకనే చెప్పారు!

“మా ప్రాంతంలో ఒక చిన్న కథ ఉంది. దోమాడ కరణం నిత్యం ఏదో ఒక లిటిగేషన్‌ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. తను చనిపోతానని తెలిసి చివరి క్షణంలో ఊళ్లో కుర్రాళ్లను పిలిచి నాదొక కోరిక ఉంది. తీర్చండి అని కోరాడు. తాను చనిపోయిన తర్వాత కర్రపెట్టి ఊరేగించమన్నాడు. తర్వాత ఇంకొకడ్ని పిలిచి నేను చనిపోయిన తర్వాత ఈ విధంగా ఊరేగిస్తే కేసుపెట్టమన్నాడు. ఫలితంగా ఆ ఊరేగించిన కుర్రాళ్లపై మర్డర్‌ కేసు పెట్టారు. దోమాడ కరణం ఊరిని బతికీ ఏపాడు, చచ్చీ ఏపాడు”… అలా ఉంది టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్టుడు ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ మండిపడ్డారు.

యనమల అస్తమానం రూల్‌ బుక్‌ పట్టుకుని తెగ తిరుగుతారు, రూల్ బుక్ పట్టుకునే మండలిలోకి వస్తారు… కానీ… అందులో ఉన్న రూల్‌ మాత్రం ఆచరించరు అని మొదలుఎప్ట్టిన బోస్… యనమలకు తెలివితేటలు ఓవర్‌ ఫ్లో అవ్వడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కండ కావరంతో ప్రవర్తిస్తోన్న టీడీపీకి నిబంధనలు అవసరం లేదని.. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులు ఆమోదం పొందకుండా చేసి 33 మూడు వేల ఎకరాలు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వీరికి వీరి అభివృద్ధే ముఖ్యం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని, దీనిద్వారా మరోసారి స్పష్టమైందని బోస్ తెలిపారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version