డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు..కేంద్రంపై కేజ్రీవాల్‌ ఫైర్‌

-

దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆప్‌ నేతలే లక్ష్యంగా సీబీఐ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనిఖీలు చేపట్టింది.

శుక్రవారం ఢిల్లీలోని సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. అటు ఈ విషయాన్ని మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే.. మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో విద్య, ఆరోగ్య నమూనాపై ప్రపంచం చర్చిస్తోంది.. ఢిల్లీలో సంక్షేమ పథకాలను ఆపాలని చూస్తున్నారని ఆగ్రహించారు సీఎం కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version