దిల్లీ సీబీఐ విభాగానికి ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు బాధ్యత

-

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు బాధ్యతను సీబీఐ డైరెక్టర్ దిల్లీ విభాగానికి అప్పగించారు. సిట్ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి తాజాగా విచారణ జరపాలని సీబీఐని ఇటీవల ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన సీబీఐ డైరెక్టర్ దర్యాప్తును దిల్లీ విభాగానికి కేటాయించారు.

ఈ బృందంలోని ఒక ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్‌స్పెక్టర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం వేదికగా దిల్లీ బృందం ఎమ్మెల్యేలకు ఎర కేసును దర్యాప్తును చేయనుంది. తీర్పుతోపాటు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును ప్రాథమికంగా పరిశీలించిన సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిద్ధమయ్యారు.

ధర్మాసనం నుంచి స్పష్టత రాగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని భావిస్తున్నారు. సీబీఐ కేసు నమోదయితే.. ఫిర్యాదు వివరాలను నమోదు చేసేందుకు.. మొదట ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version