సీబీఎస్ఈ పదో తరగతి ఫ‌లితాల విడుద‌ల‌…!

-

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నేడు పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో 2019 -20 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షల్లో 91.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకటించిన ఫలితాలను సీబీఎస్ఈ అధికార వెబ్ సైట్ cbseresult.nic.in లో పొందవచ్చని బోర్డ్ తెలియజేసింది. 2019 ఫలితాలకంటే 0.36 శాతం మంది అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు వెల్లడించింది.

CBSE-10th-Result-2020

నేడు విడుదల చేసిన ఫలితాలలో తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు జోన్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయని బోర్డు తెలిపింది. ఈ సంవత్సరం మొత్తం 18 లక్షల మంది హాజరయ్యారని, ఇందులో ఒకటి లేదా రెండు సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని బోర్డ్ తెలియజేసింది. ఇందుకు సంబంధించి తేదీలను కూడా అతి త్వరలో తెలపనుంది. సీబీఎస్ఈ ఫలితాలలో 99.28 శాతం తో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version