‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్​కు సెలబ్రెటీల స్పెషల్​ విషెస్

-

 

నేడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో తాము దిగిన పలు ఫొటోలను పంచుకుంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమ అభిమాన నటుడి పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులు సైతం నెట్టింట సందడి చేస్తున్నారు. #HBDJanasenani, #HBDPawankalyan అనే ట్యాగ్‌లు జత చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక, తన తమ్ముడి పుట్టినరోజుని పురస్కరించుకుని నాగబాబు ఓ స్పెషల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ సాగే ఈ పాట జనసైనికుల్ని ఆకర్షిస్తోంది.

 

“తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీ, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు” – చిరంజీవి

“నా గురువు, ధైర్యం పవన్‌ కల్యాణ్‌ మామకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా” – సాయిధరమ్‌ తేజ్‌

“మంచితనం, మానవత్వం, సత్యం, ధర్మం, విలువలు.. వీటిని మించిన హీరోయిజం లేదని ఆచరణలో పాటిస్తూ అనుసరణీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతోన్న కర్మయోగి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు” – రామజోగయ్య శాస్త్రి

“మంచితనానికి మారుపేరు, మంచి మనసుకి నిర్వచనం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌. పుట్టినరోజు శుభాకాంక్షలు” – పరుచూరి గోపాలకృష్ణ

“ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు” – బండ్ల గణేశ్‌

“భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరైన పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” – బీవీఎస్‌ రవి

Read more RELATED
Recommended to you

Exit mobile version