Round up 2021: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీస్ వీళ్ళే..!!

-

వివాహం అనేది ఎంతో మధురమైనది. వివాహంతో రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయి. అయితే 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు ఎవరో చూద్దాం. వీళ్లల్లో కొంతమంది డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటే మరి కొందరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే మరి 2021 లో ఒక్కటైన సెలెబ్రిటీ జంటల గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రణీత సుభాష్ నితిన్ రాజు:

హీరోయిన్ ప్రణీత సుభాష్ మే 31న బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజుతో వివాహం జరిగింది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

సింగర్ సునీత రామ్:

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత జనవరి 9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరిదీ రెండో పెళ్లి. అప్పట్లో వీళ్ల వివాహం దుమారం రేపింది.

ఆనంది సోక్రటీస్‌:

కోలీవుడ్‌ కి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ను తెలుగు అమ్మాయి ఆనంది వివాహం చేసుకుంది. ఈమె బస్స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల్లో కూడా ఈమె నటించింది.

కార్తికేయ లోహిత:

కార్తికేయ వివాహం హైదరాబాదులో నవంబర్ 21న లోహిత రెడ్డితో జరిగింది. వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

రాజ్ కుమార్ పత్రలేఖ:

11 సంవత్సరాలు రిలేషన్షిప్ లో వుంది ఫైనల్ గా నవంబర్ 15న పెళ్లిపీటలు ఎక్కారు ఈ జంట.

కత్రినాకైఫ్ విక్కీ కౌశల్:

నవంబర్ 9న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. ఏడు అడుగులు వేసి ఈ జంట ఒకటయ్యారు.

వరుణ్ ధావన్ నటాషా:

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జనవరి 14న తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా ని వివాహం చేసుకున్నారు.

యామి గౌతమ్ ఆదిత్య ధర్:

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ జూన్ 4న అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఆదిత్య ధర్ ని వివాహం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version