కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కి కరెంట్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుండి రూ. లక్ష కోట్లు ఇవ్వాలి.. అవి ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రం విభజన జరిగినప్పుడు….కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు భట్టి విక్రమార్క. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్, ఐటిఐఆర్, ట్రైబల్ విశ్వ విద్యాలయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క.