పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల వేళ సంక్షేమ పథకాలను ప్రజలకు బీజేపీ చేరనీయడం లేదని మండిపడ్డారు. ఆదివారం బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ఆధార్ లేకపోయినప్పటికీ లబ్ధిదారులకు తమ ప్రభుత్వం పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు.
ఇక, కనీస మద్దతు ధరపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు .హర్యానా, పంజాబ్‌లలో రైతులు చేస్తున్న ఆందోళనను ప్రస్తావించారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేవని,రైతుల నిరసనకు సెల్యూట్ చేస్తున్నాను. వారిపై దాడులను ఖండిస్తున్నానని మమతా బెనర్జీ వెల్లడించారు.