వడ్డీ మాఫీపై ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్‌..డైరెక్టర్‌గా ఖాతాలోనే!

-

కరోనా కాలంలో రుణాలపై విధించిన మారిటోరియం కాలాని చక్ర వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం కాలానికి రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.. రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది..మాఫీ చేసిన చ‌క్ర‌వ‌డ్డీని డైరెక్ట్‌గా ఖాతాదారుడి అకౌంట్‌లోనే వేయనున్నట్లు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది..

రుణ గ్ర‌హీత‌ల‌కు చెల్లించే మొత్తాన్ని బ్యాంకుల‌కు కేంద్రం చెల్లించ‌నుంది. మాఫీ చేసిన చక్ర వడ్డీ 2020 మార్చి 1వ తేదీ నుంచి ఆగ‌స్టు 31 మ‌ధ్య కాలానికి వ‌ర్తించ‌నుంది..స‌ద‌రు రుణ‌ఖాతా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 29 నాటికి నిర‌ర్ధ‌క ఆస్తిగా ప్ర‌క‌టించి ఉండ‌రాదు అని తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా మాఫీ చేయాల‌ని ఈ నెల 14న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు చ‌క్ర‌వ‌డ్డీని మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. చ‌క్ర‌వ‌డ్డీ మాఫీతో కేంద్ర ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ. 6,500 కోట్ల భారం ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version