ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జనవరి 18 వ తేదీ నుంచి ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యం అందించనున్నట్లు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి కుటుంబంలో ఒక్కోక్కరికీ 10 కేజీల చొప్పున రేషన్ బియ్యం అందించాలని కేంద్రం ప్రకటన చేసింది.
గత నెలలో సరిపడా నిల్వలు లేనందున.. ఈ నెలలో రెండు నెలలకు కలిపి ఒక్కక్కరికీ 10 కేజీల బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. ఈ పథకం గత డిసెంబర్ నెలతోనే ముగియగా.. కేంద్ర ప్రభుత్వం మార్చి వరకు పొడిగించిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్ సూచనలు చేశారు. కాగా.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడగిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.