యువకులను కాంట్రాక్టు కూలీలుగా మారుస్తున్న కేంద్రం: రాహుల్ గాంధీ

-

బీజేపీ ప్రభుత్వం యువతను కాంట్రాక్ట్ లేబర్లుగా మారుస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.”వాళ్లు (కేంద్రం) భారత రక్షణశాఖ బడ్జెట్‌ను జవాన్ల శిక్షణ, భద్రత కోసం ఉపయోగించడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని (యువతను) ఆర్మీలో కానీ, రైల్వేలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో రిక్రూట్ చేయకుండా మిమ్మల్ని కాంట్రాక్టు లేబర్లుగా చేయలన్నదే వారి ఉద్దేశం” అని అసహనం వ్యక్తం చేశారు . అగ్నివీర్ అనే పేరుపెట్టి యువతను కాంట్రాక్టు లేబర్లుగా మార్చారని, కనీసం సమాచారం ఇవ్వకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, తొలగించేస్తారని అన్నారు.కనీసం పెన్షన్, సాయం లాంటివేవీ లేకుండా చేస్తారని తెలిపారు.

‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం , ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ససరామ్‌లో జరిగిన యాత్రలో తేజస్వి యాదవ్ జీపు నడపగా, రాహుల్, ఇతర నేతలు అందులో కూర్చుని ముందుకు సాగారు. ‘ఇండియా’ కూటమితో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్న తర్వాత తేజస్వి యాదవ్, రాహుల్ ఒకే స్టేజ్‌పై కనిపించడం ఇదే తొలిసారి. బీహార్‌ నుంచి న్యాయ్ యాత్ర యూపీలోకి అడుగుపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version