కేంద్రం: డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్….!

-

కేంద్ర రోడ్డు రవాణా శాఖ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల అక్రెడిటేషన్‌ కి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియకు బీజం వేయనుంది. అయితే ఈ మేరకు డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్‌ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్‌ ఇవ్వనుంది. దీని కోసం శుక్రవారం (ఫిబ్రవరి 5) డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇకపై డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ధ్రువీకరిస్తే టెస్టింగ్ లేకుండానే లైసెన్సులు జారీ చేస్తారు. కానీ శిక్షణా కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు గుర్తుంచుకోండి. ఇది ఇలా ఉండగా అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి పలు నిబంధనలను ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలానే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలు ఉండేలా ముసాయిదాను రూపొందించింది.

అయితే డ్రైవర్‌ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తే లైసెన్స్‌ జారీ కోసం డ్రైవింగ్‌ టెస్ట్‌ అవసరం లేదని ఇందులో చెప్పారు. సరికొత్తగా రూపొందించిన ఈ తీరుపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత డిసెంబర్‌లోనే ముసాయిదా రూపొందించింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ‌లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరారు. అలానే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version