ఉద్యోగులకి గుడ్ న్యూస్.. శాలరీ పెంపు..!

-

మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పనుంది. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీ పెంచేలా కనపడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి బెనిఫిట్ గా ఉంటుంది. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పెంచనుండటం వలన 2022 జనవరి నుంచి ఉద్యోగుల జీతం పెరగనున్నట్టు తెలుస్తోంది.

money

ఇది ఇలా ఉంటే 11.56 లక్షలకు పైగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అమలు చేయాలనే డిమాండ్లను ఆర్థిక శాఖ చూస్తోంది. ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే‌మెన్ హెచ్ఆర్ఏ ని పెంచాలని డిమాండ్ చేస్తోంది.

ఒకవేళ కనుక కేంద్రం దీనికి సరే అంటే జనవరి 1 నుంచి ఉద్యోగుల వేతనాలు పెరగొచ్చు అని అర్ధం అవుతోంది. ఇక ఎంత వరకు మారే అవకాశం వుంది అనేది చూస్తే.. ఎక్స్ కేటగిరి కిందకు వచ్చే ఉద్యోగులకు రూ.5400కు పైగా హెచ్ఆర్ఏ, వై కేటగిరిలో ఉన్న వారికి హెచ్ఆర్ఏ రూ.3600 పెరగొచ్చు.

జెడ్ కేటగిరి అయితే రూ.1800 పెరిగే ఛాన్స్ వుంది. ఇది ఇలా ఉండగా 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాన్ని ఎక్స్ కేటగిరి కిందకొస్తుంది. వీళ్ళకి అయితే హెచ్ఆర్ఏ 27 శాతానికి చేరనుంది. వై కేటగిరిలకి అయితే 18 శాతానికి, జెడ్ అయితే 9 శాతానికి చేరొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version