కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

-

కరోనా వైరస్‌ కేసులు మళ్ళీ నెమ్మదిగా పెరుఘ్తున్నాయి. ఇప్పటికే కరోనాకి చెక్ పెట్టేందుకు అనేక తంటాలు పడుతున్న కేంద్రం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. సాధ్యమయినంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తే కరోనా వ్యాప్తి అరికట్టగలిగే అవకాశం ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముందు కరోనా ఫ్రంట్ వారియర్స్‌కి ఆ తర్వాత 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందించగా ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన‌వాంద‌రికీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ఈరోజు కేంద్ర మంత్రి ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్ ప్రకటించారు.

ఇక కరోనా తీసుకోవడానికి అర్హులై తీసుకోవాలని భావిస్తున్న వారంద‌రూ వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకుని.. వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అయితే ముందుగా 60 ఏళ్లు దాటిన వారికి, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ పరిమితం చేసినా ఇప్పుడు కరోనా  కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version