కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో గల్ఫ్‌లో జీతాలు తగ్గిసున్నారా..?

-

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, యువకులు జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్తుంటారు. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులతో అక్కడ పనిచేసే వారి జీతాలు సగానికి సగం తగ్గించారంట. అసలే కరోనా మూలంగా ఉద్యోగాలు లేకæ, పని దొరక్క సతమతమవుతున్న తరుణంలో ఈ తాజా పరిణామంతో మరింత ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోందని అక్కడి తెలుగు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 లక్షల మందిపై ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం చూపుతోంది.

 

అక్టోబర్‌ నుంచే..

గతంలో గల్ఫ్‌లో కనీస వేతనం విధానం ఉండేది కాదు. ఆయా సంస్థలు, కంపెనీలు, పని చేయించుకునే యమజనాలు వారి పనులను బట్టి వేతనాలు చెల్లించేవారు. అయినా రానురాను జీతాలు పేరుగుతూనే వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) గల్ఫ్‌ దేశాల నుంచి ఒప్పందం చేసుకొని కనీస వేతనం ఇంత అని నిర్ణయించి సెప్టంబర్‌ 9, 21 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల అభిప్రాయం, ఆయా సంఘాల నాయకులతో చర్చలు గాని జరపకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. యూఏఈ ఒమన్, ఖతర్, బహరిన్‌లకు వెళ్లే భారతీయ కార్మికుల నెల జీతాలలో సగటును 200 అమెరికన్‌ డాలర్లు ( దాదాపుగా రూ. 15 వేలు), కువైట్‌ రూ. 18 వేలు, సౌదీ అరేబియాలో రూ. 24 వేలు తగ్గించారని తెలిసింది. గల్ఫ్‌ దేశాల్లో అధికంగా ప్రభావం చూపింది. అక్కడి యజమానులు అక్టొబర్‌ నుంచే సగం జీతాలు చెల్లించడం ప్రారంభించారు.

నిరసనలు షురూ..

కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు జారీ చేసిన ఉత్వర్వులకు నిరసనగా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి నిరసనలు విమర్శలు మొదలయ్యాయి. గల్ఫ్‌కు జారీ చేసిన నూతన విధానంలో లోపాలు, జరిగే నష్టాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

1. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఖతర్‌లో ఎలాక్ట్రీ్టషియన్‌గా పనిచేస్తే నెలకు రూ. 60 వేలు సంపాదిస్తుండగా, ప్రస్తుతం అతనికి రూ. 40 వేలే ఇస్తున్నారు.
2. కాకినాడకు చెందిన ఓ యువతి కువైట్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా వి«ధులు నిర్వర్తిస్తుంది. గత మూడు నెలల నుంచి జీతాలు తగ్గిస్తున్నారని భారతప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌ను ఆస్పత్రి నోటీస్‌ బోర్డుపై అంటించినట్లు ఆమె పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version