కొత్త వేరియంట్‌తో జాగ్రత్త..రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..!

-

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్, కొవిడ్‌ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌ నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇదిలా ఉండ‌గా B.1.1529 పేరు గల ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతోంది.

corona

ఇప్ప‌టికే ఈ వేరియంట్‌కు సంబంధించి 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) కూడా వెల్లడించింది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉండాని కేంద్రం సూచించింది. మ‌రోవైపు యూర‌ప్ దేశాల్లోనూ క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. అక్క‌డ రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య‌తో పాటూ మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ నేఫ‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే దేశంలో థ‌ర్డ్ వేవ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు కూడా హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version