కరోనా కారణంగా మూతపడ్డ స్కూళ్లు తిరిగి తెరిచేందుకు వీలుగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. హోం శాఖ ఇచ్చిన అన్ లాక్ -5 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ సూచనలు చేసింది. దశల వారీగా స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు వీలుగా అక్టోబర్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని నాటి మార్గదర్శకాల్లో కేంద్రం సూచించింది. అయితే తాజాగా ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబంధించి మొదటిభాగం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ టీచింగ్ కోనసాగించే అంశాలపై రెండో భాగంలో విద్యాశాఖ మార్గదర్శకాలిచ్చింది.
స్థానిక పరిస్థితులను పరిశీలించి ఒకటొ భాగంలోని మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది. టీచింగ్ కు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాలు కేవలం సూచన మాత్రమేనని…పరిస్థితులకు అనుగుణంగా వాటిని అనుసరించవచ్చని లేదా రాష్ట్ర ప్రభుత్వాలే తమ నిబంధనలు రూపొందించుకోవచ్చని తెలిపింది. పేరెంట్స్ అనుమతితో స్టూడెంట్స్ ఇంటి నుంచే చదువుకుంటామంటే అందుకు అనుమతించాలని సూచించింది.స్కూళ్లు ప్రారంభమైన తర్వాత రెండు మూడు వారాల వరకు ఎలాంటి అసెస్‌మెంట్ చేయకూడదని, ఆన్‌లైన్ లెర్నింగ్, ఐసీటీ విధానాలను ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని సూచించింది.