చంద్రబాబు సన్నిహితుడు బొల్లినేని గాంధీకి బిగుస్తున్న ఉచ్చు !

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు, జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై గతంలో సీబీఐ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్‌ వద్ద 4 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అప్పుడు ప్రకటించారు. ఈ కేసులో సిబిఐ దూకుడు ప్రదర్శిస్తోన్నట్టు చెబుతున్నారు. ఐదు కోట్ల లంచం డిమాండ్ కేసులో సిబిఐ కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో బొల్లినేని గాంధీ చుటూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి జీఎస్టీ కమీషనర్ సుధారాణి, సూపరెండెంట్ బొల్లినేని గాంధీ లపై సెప్టెంబర్ 11న కేసు నమోదయింది. బాధితునితో నిందితుల సంభాషణల ఆడియో, వీడియోలు సేకరించిన సిబిఐ, 10లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న ఫోటో ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ అనుబంద సంస్థలపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్స్ విషయంలో కేసు నమోదయింది. ఈ కేసుల నుండి తప్పించేందుకు బాధితుడు సత్య శ్రీధర్ రెడ్డితో బేరసారాలు ఆడినట్టు సీబీఐ గుర్తించింది. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని బార్యను వదిలేసేందుకు 5 కోట్లు డిమాండ్ చేసి దొరికిపోయారు గాంధీ. బొల్లినేని గాంధీ పై ఏడాది కాలంలో రెండు కేసులు నమోదు చేయడంతో సీబిఐ ఈయన విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version