రైతులకు దీపావళి… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెట్టింపు..!

-

దీపావళి ముందు రైతులందరికీ కేంద్రం తీపి కబురు చెప్పబోతోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ఏటా రూ. 6 వేలను మూడు విడతల్లో అందిస్తుంది. దీనిని రెట్టింపు చేస్తే రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 4 వేల చొప్పునా మొత్తంగా రూ. 12 వచ్చే అవకాశం ఉంది. దీపావళి నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రానున్న కొన్ని రోజుల్లో లబ్ధిదారులు 10 విడత కిసాన్ సమ్మాన్ నిధిని అందుకోనున్నారు. పదవి విడత నగదును ట్రాన్స్ఫర్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి లబ్ధిదారులకు పదవ విడత డబ్బులు అందే అవకాశం ఉంది. దేశంలో 11.37 కోట్ల రైతులకు రూ. 1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. ప్రస్తుతం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 కన్నా ముందే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version