తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు పై తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బకాయిలు ఉన్న నిధులు వెంటనే చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 2017 వరకు తెలంగాణ డిస్కం లకు విద్యుత్ సరఫరా చేసింది ఏపీ జెన్కో. అయితే.. ఆ బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.
రూ.3,441 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్, 3315 కోట్ల లేట్ పే మెంట్ సర్ ఛార్జ్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహించారు. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యేనని.. తెలంగాణా ప్రభుత్వంపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవరిస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర అని ఆగ్రహించారు. ఏ పి నుండి రావాల్సిన 12900 కోట్లబకాయిలు పెండింగ్ లో ఉన్నాయి… కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని మండిపడ్డారు. విద్యుత్ తోపాటు,బకాయిలు, పి పి ఏ లలోను ఎపి తెలంగాణా కు నష్టమే చేసిందన్నారు.