మిడ్ డే మీల్ స్కీమ్ ఇక నుండి పీఎం పోషణ్ గా… ప్రీ ప్రైమరీ క్లాసులకి కూడా..!

-

ప్రభుత్వ పాఠశాలలు మరియు ఎయిడెడ్ పాఠశాలలో నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ని పీఎం పోషణ అని ఇక నుండి పిలవడం జరుగుతుంది. ఈ స్కీమ్ బాలవాటికలకి లేదా ప్రీ ప్రైమరీ క్లాసులకి కూడా ఇస్తున్నట్లు బుధవారం నాడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలానే తిథి భోజన్ అని పండుగలు నాడు ముఖ్యమైన రోజులు నాడు పిల్లలకి ఆహారాన్ని అందించనున్నారు.

 

అలానే స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్స్ నుండి మంచి పోషక పదార్థాలు పిల్లలకు అందేటట్టు చూడాలని అన్నారు. అలానే వంటల పోటీలు ద్వారా సాంప్రదాయ వంటకాలని పిల్లలకి తెలియజేయనున్నారు. బుధవారం నాడు యూనియన్ క్యాబినెట్ లో పీఎం పోషన్ ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలానే ఇక నుండి వేడివేడిగా పిల్లలకి ఆహారాన్ని అందించనున్నారు. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆధ్వర్యంలో తీసుకున్నారు.

ఈరోజు సీసీఈఏ వేడివేడిగా ఆహారాన్ని పిల్లలకు అందించాలని… 2021- 22 నుండి 2025-26 వరకు ఇది అమలులో ఉండాలని అన్నారు. అయితే గతంలో ఉండే దానిని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేవారు. ఈ స్కీం ద్వారా 1 నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ కి ఆహరం ఇచ్చేవారు.

అయితే కొత్త స్కీమ్ కింద ప్రీ ప్రైమరీ లేదా బాలవాటికలతో పాటుగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ కింద డబ్బులు ఇస్తుంది. పిల్లలకి ఎనిమియా సమస్య రాకుండా ఉండాలని మంచి పోషక పదార్థాలు అందించాలని ఈ మార్పు చేసారు. అయితే గతంలో కేంద్రం ఇలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రా ఏదైనా ఆహార పదార్ధాలు ఉంటే వాటి ఖర్చుని భరించేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version