IPL 2021 : నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ బిగ్ ఫైట్

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్.. దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. దుబాయ్లో జరుగుతున్న ఈ ఐపీఎల్ మ్యాచ్ లు… చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీలో 43 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇక ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షార్జా లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

వరుస గెలుపు లతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ఇవాళ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గెలవాలనే ఆత్రుతతో సన్నద్ధమవుతోంది. అటు… పాయింట్స్ టేబుల్స్ లో చిట్టచివరగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఎలాగైనా హైదరాబాద్ జట్టుపై గెలవాలని… సన్నద్ధమవుతోంది. ఇక ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశo ఉన్నట్లు సమాచారం. కాగా 16 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. కేవలం 4 పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చిట్టచివర ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version