ఐదు జిల్లా లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం గా ముగిసాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ ప్రకటించారు. పోలింగ్ కరోనా నిబంధనలు పాటిస్తూ.. సాగాయని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు.అభ్యర్థుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ లను సీజ్ చేస్తారని వెల్లడించారు. బ్యాలెట్ బాక్స్ లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసి కెమెరాల తో పాటు పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
అభ్యర్థుల కు అనుమానం ఉంటే.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా ఉంచుకోవచ్చని అన్నారు. అలాగే ఈ నెల 14 న జరగబోయే కౌంటింగ్ కూడా ఏర్పాట్ల ను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల కే కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. మొదటగా బ్యాలెట్ పేపర్ లను బండిల్స్ చేస్తారు తరువాత లెక్కింపు స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల కు విజయోత్సవ ర్యాలీ లకు అనుమతి లేదని ప్రకటించారు.