అక్రమ అరెస్టులు దుర్మార్గం..!

-

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుకి నిరసనగా కాగడాల ప్రదర్శనలో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకరరెడ్డిల అరెస్ట్ లు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలే అని, చదలవాడ అరవింద తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సంవత్సరం జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు, బీసీ నేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. కక్ష సాదించేందుకు,తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు, అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అవినీతిపై నిలదీస్తున్నందుకే కక్ష కట్టి అరెస్టు చేయించారు. ఇలాంటి తప్పుడు విధానాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని, ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version