తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చిన చైతూ..!!

-

అక్కినేని వారసుడిగా నాగచైతన్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నాగచైతన్య గతంలో వరుస డిజాస్టర్ లను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత వెంకీ మామ సినిమాతో ఒక మోస్తారు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మజిలీ, లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన థాంక్యూ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇది ఇలా ఉండగా నాగచైతన్య తన భార్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తైన వార్తలు వైరల్ అయ్యాయి. ఇక విడాకుల అనంతరం కృతి శెట్టి నీ వివాహం చేసుకోబోతున్నాడు అని కొన్నిసార్లు వార్తలు వస్తే.. మరొకసారి శోభిత ధూళిపాళ్ళ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక శోభిత ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు పై ఎట్టకేలకు నాగచైతన్య క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక పోతే నాగచైతన్య అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతూ.. కొన్ని విషయాలు కూడా తెలియజేశారు. ర్యాపిడ్ ఫైర్ అనే సెషన్ నిర్వహించగా.. విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే క్రేజీ అని సమాధానం ఇచ్చారు. ఇక అలాగే హీరోయిన్ రాశి ఖన్నా పేరు చెప్పినప్పుడు మంచి ఫ్రెండ్ అని సమాధానం చెప్పారు . అలాగే బంగార్రాజు సినిమాలో నటించిన కృతి శెట్టి పేరు చెప్పగా ఆమె చిన్న పాప అని నాగచైతన్య బదులు ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత శోభిత పేరు చెప్పగానే మొదట సైలెంట్ గా ఉండి ఆ తర్వాత గట్టిగా నవ్వారు నాగచైతన్య.ఇక శోభిత పేరు వినగానే కేవలం నవ్వుతాను అంటూ చైతన్య బదులివ్వడం జరిగింది. ముఖ్యంగా శోభిత పేరు చెప్పగానే చైతన్య నవ్వుతున్నాడు అంటే వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే శోభిత – నాగచైతన్య డేటింగ్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version