ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ పంచాయితీ ఇంకా తెగలేదు. పైగా రోజు రోజుకు ఈ తీవ్రంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తు.. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. గురువారం రాత్రి ఏపీ పీఆర్సీ సాధన సమితి సమావేశం అయింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలకు పాత పీఆర్సీ ప్రకారమే జీతం ఇవ్వాలని కోరామని అన్నారు. అలాగే అశుతుష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని అన్నారు. అలాగే కొత్త పీఆర్సీని విడుదల చేస్తు జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని తాము కోరామని అన్నారు.
ఈ కోరికలను తీరిస్తేనే.. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. కాగ కనీసం కోరికలను తీర్చడంలో కూడా ఏపీ ప్రభుత్వం విఫలం అవుతుందని అన్నారు. డిమాండ్లు ఎలా తీరుస్తారని అని ప్రశ్నించారు. కాగ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తు.. వచ్చె నెల 3వ తేదీన చలో విజయవాడ కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయలని కోరారు. అయితే కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తు.. తమ డిమాండ్లను తీర్చాలని ఫిబ్రవరి 6 వ తేదీ అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.