టీడీపీ సిట్టింగ్ సీటులో వైసీపీకి ఫస్ట్ ఛాన్స్?

-

వైసీపీ ఆవిర్భవించక అసలు ఇంతవరకు గెలవని సీట్లు కొన్ని ఉన్నాయి…2012 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ…ఇంకా గెలవాల్సిన సీట్లు కొన్ని ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే..ఆ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్..ఇక ఈ నలుగురు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి దిగుతారు.

అయితే వీరిలో వంశీకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి…వంశీ గాని గెలిస్తే గన్నవరంలో వైసీపీ ఫస్ట్ టైమ్ గెలిచినట్లు అవుతుంది. ఈ జంపింగ్ సీట్లని పక్కన పెడితే… మిగతా 19 సీట్లలో వైసీపీ కొన్ని స్థానాల్లో బలపడింది. అధికారంలోకి వచ్చాక టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ పుంజుకుంది. అలా వైసీపీ బాగా పుంజుకున్న సీట్లలో విశాఖ నార్త్ సీటు ఒకటి అని చెప్పొచ్చు. ఇంతవరకు ఇక్కడ వైసీపీ గెలవలేదు.

2014లో ఇక్కడ టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు గెలిచారు. వైసీపీ అభ్యర్ధి చొక్కాకుల వెంకట్రావుపై గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి ఉన్నా సరే ఇక్కడ వైసీపీ గెలవలేదు. టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలిచారు. వైసీపీ అభ్యర్ధి కే‌కే రాజు ఓటమి పాలయ్యారు.

అయితే ఎమ్మెల్యేగా గెలిచాక గంటా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు…అటు టీడీపీలో యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న కే‌కే రాజు..అన్నితానై చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే నియోజకవర్గ ప్రజలకు పనులు చేసి పెడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారంలో ఉండటంతో పనులు త్వరగా అయ్యేలా చూసుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ కే‌కే రాజు బలం పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో నార్త్ లో కే‌కే రాజు విజయం దాదాపు ఖాయమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు ఉంటే రాజు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఏదేమైనా నార్త్ సీటులో ఈ సారి వైసీపీ పైచేయి సాధించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version